Wednesday, July 1, 2009

మరో శుభోదయం

ప్రతి ఉదయం బాల భాస్కరునిలా
అవతరించే సూర్యుని రాకకై
వేచివుండే విపంచికలు,
తమ సుప్రభాత గీతాలతో
ఉషస్సుకి అంజలి ఘటిస్తున్నాయి

ఆ భావమాధుర్యాన్ని తమలో
నింపుకుని ప్రతి పువ్వుకు, ప్రతి కొమ్మకు
సుతారంగా అందిస్తున్నాయి
గాలి తిమ్మెరలు

ఆ స్పర్సతో తుషార బిందువులు
ఆలవోకగా జారి పుడమి తల్లిని స్ప్రుసిస్తున్నాయి
ఈ అందాన్నిఆస్వాదిస్తున్న నా మనసు
మరో శుభోదయం కోసం వేచి వున్నది
\